Sunday, 8 November 2026

వార్తలు

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం:వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుంతోంది.బడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగాఅల్పడీన ద్రోణి కొనసాగుతోందిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో పలుచోట్ల వానలు కురిసే అవకాశముంది.

విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: అల్పపీడన  ప్రభావంతో విశాఖపట్నంలోని అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మూడురోజులునుంచి అటవీప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఏజెన్సీలో 10సెం.మీ, వర్షపాతం నమోదయింది.

జశ్వంత్‌ నామినేషన్‌

ఢిల్లీ, జూలై 20 (జనంసాక్షి): భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డిఎ తరుపున జస్వంత్‌సింగ్‌ ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డిఎ నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా యూపిఎ అభ్యర్థి అన్సారి నామినేషన్‌ దాఖలు చేసిన…

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.…

రేపటి నుంచి రంజాన్‌ ఉపవాసాలు

హైదరాబాద్‌: చెన్నై, మైసూరుల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8:30వరకు 5.5మి.మీ వర్షపాతం నమోదయింది. వర్షపునీటిలో డ్రైనేజీలు పొంగిపొర్లడడంతో కీలకప్రాంతాల్లో ట్రాఫీక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టుప్రాంతాల్లో నీరు చేరడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు.

గాలి బెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలం నమోదు

హైదరాబాద్‌: గాలిబెయిల్‌ కేసులో సాక్షి లక్ష్మయ్య చౌదరి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఏసీబీ నమోదు చేసింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు ప్రమేయాన్ని లక్ష్మయ్య చౌదరి ప్రస్తావించారు. స్నేహితుడు సూర్యప్రకాశ్‌తో ఏప్రిల్‌ 20న బళ్లారిలో శ్రీరాములును…

రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాగల 24గంటల్లో కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూన్‌ 1నుంచి జులై 18 వరకు 194.6మి.మి వర్షం కురవాల్సి ఉండగా 136.9మి.మి పడిందని పేర్కొంది.…

యూపీఏలోనే కొనసాగుతాం

న్యూఢిల్లీ: యూపీఏలోనే కొనసాగనున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌కు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి లేఖరాశారు. కేంద్రంలో కీలక వ్యక్తి శరద్‌పవార్‌ అని మన్మోహన్‌ ప్రకటించిన అనంతరం పవార్‌ లేఖ…

హైదరాబాద్‌ నగరంలో భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: నగరంలో ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయ్యాయి. వర్షం భారీగా కురవడంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం అయింది. బంజారాహిల్స్‌ లోని రోడ్‌ నెంబర్‌2,3లలో ఎక్కడి విహనాలు అక్కడే నిలిచిసోయాయి. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట…