Sunday, 8 November 2026

వార్తలు

కాంగ్రెస్‌లో వైకాపా విలీనం: కేటీఆర్‌

హైదరాబాద్‌: భవిష్యత్తులో కాగ్రెస్‌లో వైకాపా విలీనం కావడం ఖాయమని తెరాస నేత కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, వైకాపాలు దొంగ నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కు మద్దతునివ్వాలని వైకాపి నిర్ణయించడంతో ఇరు పార్టీల…

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఒంగోలు: ఒంగోలు చీరాల మధ్య రైలుమార్గంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆ మార్గంలో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. వెటపాలెం స్టేషన్‌లో హైదరబాద్‌ ఎర్నాకుళం శబరి ఎక్స్‌ప్రెస్‌, చీరాలలో ఆలెప్పీ ఎక్స్‌ప్రెస్‌, అమ్మనబ్రోలులో పినాకిని ఎక్‌సప్రెస్‌…

గాంధీ ఆసుపత్రిలో లేబర్‌వార్డు మూసివేత

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో 10రోజుల పాటు లేబర్‌వార్డును అధికారులు మూసివేశారు. ధనుర్వాతం వైరస్‌ సోకిందని అధికారులు ఆ వార్డును మూసివేశారు. ఇతర ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

ప్రభుత్వంతో ఇక చర్చలు లేవు;అన్నాహజారే

రాలేగావ్‌సిద్దీ: లోక్‌పాల్‌ ఆంశంపై ఇకపై కేంద్రంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని గాంధేయవాది అన్నాహజారే అన్నారు. తన బృందంలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం య్నతిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు.

భూములు కేటాయింపు కొనసాగితే సామాన్యులకు భూములు మిగలవు :మాణిక్యవరప్రసాద్‌

హైదరాబాద్‌: భూకేటాయింపులు పద్దతిలేకుండా కొనసాగితే రాష్ట్రంలో సామాన్యలకు భూములకు మిగలవని రాష్ట్రమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వాన్‌పిక్‌కు 28వేల ఎకరాలు కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ నౌకాశ్రయానికి ఇంతగా భూములను ఇవ్వలేదన్నారు. తనకు తెలిసి…

ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల నిర్వహణకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిఆ్ల తణుకులో జరిగిన…

ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా

ఏలూరు: ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట తెదేపా ధర్నా  ఉండి ఎమ్మెల్యే కె.శివరామరాజు మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించగా, ధర్నాలో దేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌రావు, జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం కలెక్టరేట్‌కు వినతి పత్రం…

వరుస సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక హీరో రాజేష్‌ఖన్నా

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ఖన్నా మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దేశ సినీరంగం దిగ్గజ నటుడిని కోల్పోయిందని చిత్ర రంగ పెద్దలు అభిప్రాయపడ్డాడు. వరుసగా 15సిల్వర్‌ జూబ్లీ సినిమాలను అందించిన ఏకైక…

హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.ఆల్‌ఖైదాకు అనుబందంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.…

28నుంచి శ్రీవారి తోమాల సేవ ప్రసారం

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి తోమాల సేవను ఇంటి దగ్గరే కూర్చుని తిలకించే బాగ్యాన్ని తితిదే ఈనెల 28 నుంచి కల్పించనుంది. శ్రీవారి ఆర్జిత సేవలను నమూనా ఆలయం నుంచి తితిదే చిత్రీకరించింది. తిరుమల ఆలయంలో స్థలాభావం కారణంగా…