Sunday, 8 November 2026

వార్తలు

ఓటు వేసిన స్పీకర్‌ మనోహర్‌, జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఓటింగ్‌ ప్రక్రియ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుగా వచ్చి అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. అనంతరం లోకసత్తా అధినేత జేపీ తన ఓటు…

రణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఎలాంటి రసీదులు లేని రూ. 1.34 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో సిబ్బంది అక్కడి నుంచి…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి.:స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నీఫ్టీ కూడా 30 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరుడి ఎంపిక కోసం రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లో పోలింగ్‌ ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పార్లమెంట్‌ భవనంలోని రూం. నెంబర్‌ 63లో పోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు  ఉదయమే పలువురు…

తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపు

విశాఖ: గ్రీన్‌ హంట్‌కు వ్యతిరేకంగా తూర్పు డివిజన్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. పోలీసుల కూంబింగ్‌కు నిరసనగా నేడు, రేపు  ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో బంద్‌ పాటించాలని మాయిస్టులు ఓ లేఖలో తెలియజేశారు. దీంతో జిల్లాలో పలు ప్రాంతాలకు ఆర్టీసీ…

నేడు రాజేశ్‌కన్నా అంత్యక్రియలు

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌కన్నా అంత్యక్రియలు నేడు ముంబయిలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొననున్నారు. ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్‌కన్నా నిన్న ముంబయిలోని తన స్వగృహంలో కనుమూశారు.

ఎస్సై పరుగు పందెంలో అపశ్రుతి

విశాఖ: ఎస్సై నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుడు పందెంలో అపశ్రుతి చోటుచేసుకుంది.పరుగుపందెంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అదుపుతప్పి కింద పడిపోవడంతో అతని కాలు విరిగిపోయింది. క్షతగాత్రున్ని  కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

పగ్గాలు చేపట్టడంపై రాహులే నిర్ణయించుకోవాలి : సోనియా

న్యూఢిల్లీ:పార్టీలో కీలక పాత్ర పోషించడం, పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తుది నిర్ణయం రాహుల్‌ దేనని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. యూపీఏ ఉప రాష్ట్రపతిగా అభ్యర్దిగా హమీద్‌ అన్సారీ నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో సోనియా…

యుపిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా అన్సారి నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ, జూలై 18 : యుపిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారి బుధవారంనాడు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఎదుట దాఖలు చేశారు. హమీద్‌ అన్సారీతో పాటు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌,…

ప్రభుత్వకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ పథకాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ధర్మానప్రసాదరావు కమిటీకి పలువురు కాంగ్రెస్‌ ఎమ్మోల్యేలు, ఎమ్మెల్సీలు సూచించారు. అందరి అభిప్రాయాలను సేకరించి ఈ నెల 21న ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ సభ్యడు…