టీఎస్పీఎస్సీకి కొత్త బాస్..!

హైదరబాద్ : తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎక్జామ్ లీకేజీలు కావవడంతో టీఎస్పీఎస్సీపై ఎగ్జామ్ ల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారంలోకి రాగానే గత కమిషన్ చైర్మన్, సభ్యులంతా రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో నూతన చైర్మన్, సభ్యుల నియామకంపై ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగానే సర్కారు తాజాగా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి చైర్మన్ గా ప్రతిపాదించింది. ఈ నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. కాగా గతంలో మహేందర్ రెడ్డి డీజీపీగా పనిచేసి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు.