Monday, 2 November 2026

JEE మెయిన్స్ ఫలితాలు విడుదల…. సత్తా చాటిన తెలుగు విద్యార్ధులు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం(ఏప్రిల్-30) సాయంత్రం ఢిల్లీలో CBSE ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫ‌లితాల్లో తెలుగు విద్యార్థులు స‌త్తా చాటారు. విజయవాడకు చెందిన సూరజ్‌ కృష్ణ మొదటి ర్యాంకు సాధించ‌గా, వైజాగ్ విద్యార్ధి హ‌న్మంత్ రెండవ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ కు చెందిన విద్యార్థి గట్టు మైత్రేయకు ఐదో ర్యాంకు సాధించాడు. ఐఐటీ, ఎన్‌ ఐటీలతో పాటు ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8న JEE ఆఫ్‌ లైన్ పరీక్ష నిర్వహంచగా…15,16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 1.50 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. JEE ఫలితాలను www.jeemains.nic.in, cbseresults.nic.in వెబ్‌ సైట్లో చూసుకోవచ్చు.