Tuesday, 3 November 2026

ఈ రోజు

వార్తలు

నేడు రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్‌ పదవీవిరమణ

న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్‌కు  12వ రాష్ట్రపతిగా తన సేవలందించిన శ్రీమతి ప్రతిభాపాటిల్‌ ఈ రోజు పదవీవిరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు జాతినుద్ధేశించి ప్రసంగిస్తారు. నిన్న ఆమెకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీడ్కోలు సభ నిర్వహించి,…

హైదరాబాద్

రాజధానిలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ రోజు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్‌ ఆవాస్‌ పథకాన్ని ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

హైదరాబాద్‌:నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం కృష్ణడెల్టాకు  నీటిని విడుదల చేయటంపై ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రభుత్వానికి సిగ్గుచేటు, చెంపపెట్టు లాంటిదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందని ఆయన అన్నారు.