Monday, 2 November 2026

తూర్పుగోదావరి జిల్లా

వార్తలు

కార్మికులను అడ్డుకున్న గనుల శాఖ అధికారులు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కుమార్‌ టాకీస్‌ వద్ద బోట్స్‌మెన్‌ అసోసియేషన్‌ కార్మికులను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారనే కారణంగా వారిని అధికారులు అడ్డుకున్నారు.  

హైదరాబాద్

జొన్నాడ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

హైదారాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. జిల్లాలోని ఆలమూరు…

వార్తలు

పాలగడ్డ అటవీ ప్రాంతంలో భారీ డంవ్‌ స్వాధీనం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా వై. రామవరం మండలం పాలగడ్డ అటవీ ప్రాంతంలో ఈ రోజు భారీ డంవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంవ్‌ను తీవ్రవాద వ్యతిరేక దళం స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న డంవ్‌ను కాకినాడ తరలించారు.

వార్తలు

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 స్థానాల్లో  పోటి చేసినప్పటికీ  రెండు స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకుంది.