వార్తలు
బెంగళూరులో అగ్నిప్రమాదం
బెంగళూరు: నగరంలో బర్జర్ పెయింట్స్ గోదాంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
