హైదరాబాద్
వీసీ నియామకం తాత్కాలికంగా నిలిపివేత
హైదరాబాద్: ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఎ. పద్మరాజు నియామకాన్ని గవర్నర్ నరసింహన్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పద్మరాజును నియమిస్తూ ఈరోజు ఉదయమే గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
