జరజాంలో చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి
శ్రీకాకుళం: ఎచ్చర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు చెరువులో స్నానానికి వెళ్లి ఈత రాక మృతి చెందారు. ఆదివారం సెలవు కావటంతో సమీపంలోని చెరువులోకి ముగ్గురు చిన్నారులు స్నానానికి వెళ్లారు. చెరువులోతుగా ఉండటంతో ఈతరాక నీటిలో మునిగి చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీరిని అలేఖ్య(6), దివ్య(5) గరుడహేమసుందర్(6)గా గుర్తించారు. పోలీసులు స్థానికులతో కలిసి మృత దేహల కోసం గాలింపు చేపట్టారు.



