నేడు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆయా పార్టీ కమిటీల ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్ధనరావు ఒక ప్రకటనలో తెలిపారు.