పోప్‌ఫ్రాన్సిన్‌ తొలి ప్రార్థన

వాటికన్‌ సిటీ : కొత్త పోప్‌ఫ్రాన్సిస్‌ మంగళవారం సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో తొలి ప్రార్థనను నిర్వహించారు. వేలాది మంది క్యాథలిక్‌ భక్తులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వీస్‌ ప్రారంభించడానికి ముందు ఆయన టాప్‌లేని జీపులో 20 నిమిషాల పాటు ప్రజల మధ్య తిరిగారు. పలువురిని దీవించారు. అనంతరం పోప్‌గా కార్డినల్స్‌ ఆయన చేత ప్రతిజ్ఞ చేయించారు. నిరాడంబరతను ఇష్టపడే కొత్త పోప్‌ బంగారు ఉంగరానికి బదులు బంగారుపూత పూయించిన వెండి ఉంగరం ధరించడానికి మొగ్గుచూపారు. జర్మన్‌ ఛాన్సలర్‌ యాంజెలా మెర్కెల్‌, అర్జెంటినా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.యూరోపియన్‌ ఆంక్షలను లెక్క చేయకుండా జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం విశేషం. దాదాపు వెయ్యేళ్ల తర్వాత పురాతన చర్చి ప్రతినిధులంతా పోప్‌ తొలిమాన్‌కు హాజరయ్యారని వాటికన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.