బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్‌: ఉచితంగా సరఫరా కచ్చితంగా అమలయ్యేల చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లకు మైనింగ్‌ అధికారులకు ఆదేశాలు జారిచేసింది. ఏ రిచ్‌ నుండియైన తప్పనిసరి ఇవ్వాల్సిందేనని ఈ నిబంధనలు పాటించకుంటే లీజులు రద్దు చేస్తామని వేలంపాట పూర్తయిన రీచ్‌లకు వేలంపాట నిర్వహించ బోయే రీచ్‌ లకు వర్తిస్తుందని నిబంధనలకు విరుధంగా ఇసుక తవ్వకాలు జరగకుండ తనిఖీలు చేయాలని రాష్ట్ర వ్యాప్తాంగా 36రీచ్‌లకు పర్యావరణ అనుమతులు రాగా 18రీచ్‌లకు వేలంపాట నిర్వహించామని మంత్రి డికె అరుణ తెలిపారు. ఈ నెల 6న శ్రీకాకుళంలోని 6రీచ్‌లకు, గుంటూరులోని 3రీచ్‌లకు త్వరలోనే వేలం నిర్వహిస్తామని 17ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల్లో లక్ష13వేల క్యూబిక్‌ మీటర్ల తాత్కాలిక అనుమతులిచ్చినట్లు మంత్రి తెలిపారు.