‘భారం తగ్గించేవరకూ దీక్ష విరమించేదిలేదు’
హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలపై మోపిన రూ.6,500 కోట్ల రూపాయలు భారం తగ్గించేవరకు నిరవధిక దీక్ష ఆపేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఎన్ని పోదాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ఛార్జీల పెంపును నిరసిసూ వైఎస్‌ఆర్ పార్టీ చేపట్టిన దీక్ష నేటికి మూడో రోజుకు చేరింది.


