రిమ్స్‌లో ర్యాగింగ్‌ భూతం

రిమ్స్‌,న్యూస్‌టుడే: ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కళాశాలల్లో చేరుతున్న వారి పట్ల తోటి విద్యార్ధులే ర్యాగింగ్‌ పేరిట తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఇలాంటి తంతంగం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ కళాశాలలో మరోసారి వెలుగుచూసింది. వైద్య విద్య మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధిపై ఆదివారం సాయంత్రం కొందరు సీనియర్‌ వైద్య విద్యార్ధులు ర్యాగింగ్‌ చేసినట్లు సమూచారం. సదరు విదార్ధిని సీనియర్‌ చెప్పులతో చెంపలు వాయించుకుంటూ క్యాంపస్‌ చుట్టూ తిరుగాలంటూ వేదించారు. పలుమార్లు ఆ విద్యార్ధి విన్నవించుకున్న వారు వినకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. చేసేదేమిలేక సీనియర్‌ల ఆగడాలను భరిస్తూనే ఆ విద్యార్ధి తన చెప్పులతో చెంపలు వాయించుకుంటూ కళాశాల ప్రాంగణం చుట్టూ తిరిగినట్లు తెలిసింది. గతంలో సైతం ఓ విద్యార్ధి కూడా ర్యాగింగ్‌కు బలైనా యాజమన్యం దాన్ని బయటకు పొక్కకుండా కప్పిపుచ్చింది. ఈ సంఘటనతోనే పలుముర్లు పోలీసులు ర్యాగింగ్‌ నిరోధక సరస్సులను సైతం ఏర్పాటుచేసి విద్యార్ధులను అవగాహన కల్పించారు. అయినప్పటికీ విద్యార్ధుల్లో మార్పు రాకపోగ తాజాగా మరో విద్యార్ధి ఈ రాగింగ్‌ భూతానికి బలవడం చర్చనీయాంశమవుతోంది.
విచారణ చేపడతాం..
రవీందర్‌ రెడ్డి, రిమ్స్‌ సంచాలకుడు
ర్యాగింగ్‌ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ రిమ్స్‌ సంచాలకులు రవీందర్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా దీనిపై సత్వరమే విచారణ చేపడుతామని ఆయన పేర్కోన్నారు. జూనియర్‌ విద్యార్ధులను వేరిస్తే ఎవరైన సరే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.