Wednesday, 4 November 2026

¬టళ్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ఫీర్జాదిగూడ కమిషనర్‌ శ్రీనివాస్‌ హెచ్చరిక

హైదరాబాద్‌,నవంబరు19(జనం సాక్షి): ¬టళ్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఫీర్జాదిగూడ నగరపాలక సంస్థ కమిషనర్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. నాసిరకం ఆహార పదార్థాలు వాడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ¬టళ్ల యజమానులు వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కోరారు. ‘మన నగరం-మన ప్రణాళిక’లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోగల పలు ¬టళ్లలో తనిఖీలు నిర్వహించారు. పర్వతాపూర్‌ రోడ్డులోగల బావర్చి ¬టల్‌లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్‌ ¬టల్‌ యజమానికి రూ. 10 వేల జరిమానా విధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలన్నారు. తనిఖీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రదీ?పరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.