శివ్వంపేట ఆగస్ట్ 27 జనంసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిన్నగొట్టిముక్ల చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాసం చివరి శనివారం కావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తడంతో అంజన్న ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. అమావాస్య, శనివారం రెండు కలిసిరావడం తో భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవాలయం లో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు వారి చెల్లించుకున్నారు. ఫౌండర్ చైర్మన్ భాస్కరరాయుని ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి రామతారక జపం, మన్యుసూక్తం, పురుషసూక్తం, చందనోత్సవం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ కమిటీ తరుపున అన్ని రకాలుగా ఏర్పాట్లు కల్పించమని ఆలయ ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవదత్తు శర్మ, అర్చకులు శ్రీవాత్సవ శర్మ, దేవి ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
అంజన్న దేవాలయంలో భక్తజనం ప్రత్యేక పూజలు




