అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వారోత్సవాలు

మునగాల, సెప్టెంబర్ 25(జనంసాక్షి): మునగాల మండలం ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అక్టోబర్ ఒకటో తేదీన జరిగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా ఆదివారం నాడు ఆశ్రమంలో వృద్ధులకు రెండవ రోజు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్చీ ఆట, క్యారమ్స్, చెస్, పరుగుపందెం తదితర ఆటలు నిర్వహించి బతుకమ్మ పండగ సందర్భంగా మొదటి రోజైన ఎంగిలిపువ్వు బతుకమ్మను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ఆటలపోటీలలో భాగంగా క్యారమ్స్ లో నాగయ్య, చెస్ పోటీలో జోసఫ్, కుర్చీ ఆటలో ధరావత్ హాతిలి, పరుగు పందెంలో రాములమ్మలు ప్రదమ స్థానంలో నిలిచారు.  ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, ముకుందాపురం అంగన్వాడీ టీచర్లు టి.వెంకటరమణ, వి. సంధ్య, ఆయాలు ఎం.ధనమ్మ, ఆర్ లక్ష్మి, అమరగాని రాజేష్, కన్నా ఉపేంద్రవర్మ కీర్తి, నీలమ్మ, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.