అంబటి సుభద్ర మృతదేహానికి నివాళులు అర్పించిన -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్

కురవి సెప్టెంబర్ 01( జనంసాక్షి న్యూస్).

కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన కీ” శే” అంబటి సుభద్ర స్వర్గస్తులు చెందడంతో విషయం తెలిసిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ గురువారం భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య , జిల్లా టిఆర్ఎస్ యూత్ నాయకులు గుగులోతు రవి నాయక్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, నల్లల్ల సర్పంచ్ సుధాకర్ రెడ్డి, చంద్రా రెడ్డి , నిమ్మలగంటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.