అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

మేళ్లచెరువు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బతుకమ్మ పండుగ  ఉత్సవాలను సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు మరియు యువతుల సహకారంతో ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు.తెలంగాణ పండుగైన బతుకమ్మను తంగేడు,గునుగు పూలతో అలంకరించి,మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించేలా ఆటపాటలతో బతుకమ్మను పూజిస్తూ ఆడపడుచులంతా భక్తిని చాటుకున్నారు. గ్రామంలో జరిగిన బతుకమ్మ పండుగ మహోత్సవంలో గ్రామానికి చెందిన యువతులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ శంకర్ రెడ్డి వార్డ్ మెంబర్స్ మండలంలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు

Attachments area