కార్యకర్తలే పార్టీకి ప్రాణం

ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినేపల్లి. జనం సాక్షి. సెప్టెంబర్.26. కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీకి ప్రాణం మనీ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు సోమవారం మండల పరిధిలోని వడ్డేమాన్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయిన నిరంజన్ బాలస్వామిలు అనారోగ్యాలతో మృతి చెందడం పట్ల వారి కుటుంబాల ను సోమవారం పరామర్శించి ప్రమాద బీమా రెండు లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు వీరు పార్టీలు గత కొంతకాలంగా పనిచేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొందడంతో వారికి టీఆర్ఎస్ పార్టీ ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రెండు లక్షల చెక్కులను వారికి అందజేయడం జరిగిందని అన్నారు పార్టీల మనగాడా పార్టీ కార్యకర్తల మీద ఆధారపడి ఉంటుందని ఈ విషయం తెలిసినా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీల కార్యకర్తలకు ప్రమాద బీమా సదుపాయం కల్పించారన్నారు వారి కి అందే ప్రీమియం కూడా టిఆర్ఎస్ పార్టీ చెల్లించే విధంగా ఏర్పాటు చేశారన్నారు ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
Attachments area