మోర్తాడ్ (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం, ఏరుగట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. గణతంత్రదినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కోసం సోమవారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న గ్రామస్తులు ముఖం, చేయి భాగంలో ధ్వంసం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామంలో పరిస్థితి శాంతియుతంగానే ఉంది.




