హైదరాబాద్: ప్రముఖ నటి, బ్లూక్రాస్ అధ్యక్షురాలు అక్కినేని అమలను ఈరోజు చార్మనార్ పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్‌పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్‌ను కట్టినందుకు ఆమెను, గ్రీన్ పీస్ కార్యకర్తలను సెక్షన్ 151 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చార్మినార్ పోలీసులు తెలియజేవారు. బొగ్గు తవ్వకాలను నిరసిస్తూ భారత దేశ అడవులను పరిరక్షించాలని కోరుతూ ఆమె చార్మినార్‌కు బ్యానర్‌ను కట్టారు. అరెస్టు అనంతరం ఆమెను సోంత పూచీకత్తుపై విడుదల చేశారు.




