Thursday, 5 November 2026

అక్టోబర్‌ 3 నుంచి గ్లోబల్‌ వాటర్‌ సదస్సు

– ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు మంత్రి చందూలాల్‌ ఆదేశం
హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : భవిష్యత్తులో ఆహార పదార్ధాల కొరత ఏర్పడకుండా.. జనాభాకు తగ్గట్టు నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి చందూలాల్‌ చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి 6 వరకు గ్లోబల్‌ వాటర్‌ సదస్సు హైదరాబాద్‌ లోని తాజ్‌ కృష్ణ ¬టల్‌ లో జరుగుతుందని ఆయన వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే సదస్సులో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ హబ్‌ గా మారిందన్నారు. నీళ్లు తగ్గుతున్నాయి, అవసరాలు పెరుగుతున్నాయని తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలతో పోటీ పడి మరీ హైదరాబాద్‌ కు సదస్సులు తీసుకొస్తున్నామని చెప్పారు. గ్లోబల్‌ వాటర్‌ సదస్సు సన్నాహక సమావేశం హైదరాబాద్‌ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజంపై రూపొందించిన షార్ట్‌ ఫిల్మ్‌ ను మంత్రి చందూలాల్‌ విడుదల చేశారు.