అక్టోబర్ 1 వ తారీఖున జరిగే ఏఐటీయూసీ మండల మహాసభ ను జయప్రదం చేయండి

గరిడేపల్లి, అక్టోబర్ 25 (జనం సాక్షి): పాలక వర్గాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానలపై  చర్చించి పోరాట కార్యక్రమం రూపొందించాటానికి  గరిడేపల్లి మండల కేంద్రంలో అక్టోబర్ 1 వ తారీఖున ఏఐటీయూసీ మండల మహాసభ ను ఏర్పాటు చేయటం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ త్రిపురం సుధాకర్ రెడ్డి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బెజ్జం రమేష్ లు అన్నారు. ఆదివారం మండల ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చిస్తారని మహాసభ లో ఏఐటీయూసీ జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నందున కార్మికులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ మండల నాయకులు బండ్ల ఆనందరావు, యడవల్లి వెంకటేశ్వర్లు, ప్రతాని సైదులు, బాజోజు అప్పాచారీ, పిట్టా రవి,  శేషగిరి, మొదల శ్రీను,  రాకేష్, నకిరేకంటి రవి,  వెంకన్న తదితరులు పాల్గొన్నారు.