Wednesday, 4 November 2026

అక్టోబర్ 2న శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయం లో ప్రత్యేక అక్షరాభ్యాసాలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి):

ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ నెల 2వ తేదీన ఆదివారం నాడు శ్రీ మహా సరస్వతి దేవి జన్మనక్షత్రం రోజు మూల నక్షత్రం, ఆదివారం సప్తమి తిథి ఉన్నందున ఆదివారం ఆలయంలో ప్రత్యేకంగా మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసులో గల వారి కి అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, ఆలయ కార్యనిర్వాక అధ్యక్షురాలు దొడ్ల ఇందుమతి తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఈ ప్రత్యేక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని, ఈ అవకాశాన్ని ఈ ప్రాంతం వారు సద్వినియం చేసుకోవాలని వారు కోరారు. వివరాలకు 9441303182, 94402 05792 సెల్ నెంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.