Wednesday, 4 November 2026

రెవెన్యూ మేళాలో ఇంటి పన్ను చెల్లించండి

మేడిపల్లి – జనంసాక్షి

బోడుప్పల్ నగరపాలక సంస్థ ప్రజలందరూ గడువులోగా ఇంటి పన్నులు బకాయిలను చెల్లించి, నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని మేయర్, కమిషనర్ ఓ ప్రకటనలో కోరారు. ఈ మేరకు బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధి గల ఇంటి యజమానులకు, అపార్ట్మెంట్స్ యజమానులకు, వివిధ కాలనీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ఈ విషయాన్ని గురువారం తెలియజేశారు. అక్టోబర్ 31వరకు గడువు ఉందని, తమతమ ఇంటి వద్దకు వచ్చే బిల్ కలెక్టరులుగానీ, మున్సిపల్ కార్యాలయంలోని పౌర సేవ కేంద్రంలోగానీ, లేదా ఆయా డివిజన్లలో జరుగు రెవిన్యూ మేళా ప్రత్యేక డ్రైవ్ లోగానీ ఇంటి పన్నులు చెల్లించగలరని కోరారు. గడువు (అక్టోబర్ 31) లోపల చెల్లించిన వారికి మాత్రమే 90% వడ్డీపై రాయితీ కల్పించబడునని వారు పేర్కొన్నారు.