అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం:సీపీ రామగుండం
అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం.-సీపీ రామగుండం
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.
రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం *పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ (తేది :21- 10- 2023 నుండి 31 -10 -2023) వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐ.పి.ఎస్., (డిఐజీ) తెలియజేశారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు మొదలగునవి విషయాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.
👉 ఆన్లైన్ లో https://forms.gle/b7bejvzfo6j29Vuz6 ఈ వెబ్ సైట్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో అనగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును. వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా కేటగిరి-1:స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్ వరకు సమర్థవంతమైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కేటగిరి-2: డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడం లో పోలీస్ పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 24 అక్టోబర్ 2023 వరకు సమర్పించవచ్చును. అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చని తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను కమిషనరేట్ లో బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు
👉 పోలీసులకు వ్యాసరచన పోటీలు: కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు..పోలీసులకు పని -జీవిత సమతుల్యత. *కేటగిరి-2: ఎస్.ఐ స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు..సమాజం లో లింగ సమానత్వాన్ని కాపాడడం లో పోలీస్ పాత్ర. వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ వ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలకు మించకుండా వ్యాసరచనలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం మరియు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు
👉రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
👉పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది
👉 షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు : విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను కమీషనరేట్ లో బహుమతి ప్రధానం చేస్తూ, రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఫోటోలు, వీడియోలు ఈనెల తేది: 25-10-23 లోపు స్పెషల్ బ్రాంచ్ (NIB) కార్యాలయంలో అందించాలి.
👉ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఈ నెల అక్టోబర్ 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు “పోలీస్ అమరవీరుల సంస్మరణ లో ఘనంగా నివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్”, ” పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐ.పీ.ఎస్., (డిఐజీ) తెలియజేశారు