అక్బర్ పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ నందు ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరణ.

 

దుబ్బాక సెప్టెంబర్ 17,( జనం సాక్షి )
టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి సూచనతో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం  హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17,1948లో భారతదేశంలో విలీనమైన వచ్చే ఏడాది సెప్టెంబర్ 17,2023 వరకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా సందర్భంలో ఏడాది  పొడవునా తెలంగాణ వ్యాప్తంగా వజ్రోత్సవాల నిర్వాహణలో భాగంగా అక్బర్ పేట-భూంపల్లిఎక్స్ రోడ్డు నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బుల బాలా గౌడ్, పాతూరి వెంకటస్వామి గౌడ్, బొమ్మెర శ్రీధర్, పూజారి నారాయణ, కోరంద రవీందర్ రెడ్డి, ఉత్తం నరేష్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, బాలు యాదవ్, పుద్దోజు ప్రభాకర్ చారి, మహిళా నాయకురాలు పున్నావా, సురేందర్ రెడ్డి, యాదవ్ గౌడ్, సాగర్ గౌడ్, సాజిద్, అబిద్, మండల మల్లయ్య, చంద్రం, ఎర్రోళ్ల బాల నర్సు, షేర్ పల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area