అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు
ఎస్సై శ్రీధర్ రెడ్డి
బిచ్కుంద అక్టోబర్ 10 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద
మండలంలో శెట్లూర్ గ్రామం నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీసులు సీజ్ చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు