Friday, 6 November 2026

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి ఎస్సీ మోర్చా

మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు..

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 17

అల్వాల్  మున్సిపల్ కార్యాలయ పరిధిలోని గత కొన్ని నెలలుగా ప్రభుత్వ స్థలాలలో మునిసిపల్ అధికారులు స్మశాన వాటికగా గుర్తించి ప్రభుత్వ స్థలమని బోర్డులు పెట్టినప్పటికీ ఇట్టి స్థలంలో గ్రీన్ ఫీల్డ్ కాలనీ కిష్టమ్మ ఎంక్లేవ్ తుర్కపల్లి కౌకూర్ ఐస్ ఫ్యాక్టరీ రోడ్ తదితర ఏరియాలలో అక్రమాలు జోరుగా కొనసాగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో ఇష్టానుసారంగా చట్ట విరుద్ధంగా అనుమతులు లేకుండా భవనిర్మానాలు కమర్షియల్ షెడ్లు నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి కి మేడ్చల్  బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఈ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలను చూసి చూడనట్లుగా వీటిపై చర్యలు తీసుకున్నట్లు నటిస్తూ దొడ్డిదారిన వారికి సహకారం అందించనున్నారని వీటి పైన పత్రిక ప్రకటన కూడా వేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వ అధికారులకు నిమ్మకు నిరత్తినట్లుగా వ్యవహరిస్తూ ఇట్టి నిర్మాణాల వలన ప్రజలకు డ్రైనేజీ రోడ్లు మరియు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నందున ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా ప్రభుత్వం నష్టపోతుందని నిర్మాణాల పైన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నిర్మాణాలు నిలుపుదల చేయాలని లేని పక్షంలో ఎస్సీ మోర్చా జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేపడతామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుదర్శని, రవి, కిరణ్, సుజాత, శ్రీధర్ రెడ్డి, పద్మిని, అనిల్ యాదవ్, తూప్రాన్ లక్ష్మణ్, వంశీ, రాజిరెడ్డి, ఆనంద్, ఉదయ్, ప్రకాష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area