అక్రమ నిర్మాణాలు ఆపాలి:తుప్పతి శ్రీనివాస్
బచ్చన్నపేట అక్టోబర్ 9(జనం సాక్షి):పోచన్నపేట పెద్ద చెరువు సమీపం లోని 6 , 7 సర్వే నెంబర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో భూమి కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని భూమి లోకి వెళ్లే దారిని అతనే మూసి వేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ముందే గేట్ నిర్మాణం చేయగా, గ్రామస్థులు అడ్డుకోగా కొద్దిరోజుల అనంతరం మళ్ళీ ఈరోజు అడ్డగోలుగా గేట్ నిర్మాణం చేయడం సరి కాదని , గతం లోనే ఈ భూమి లో యాభై శాతం భూమి ఎఫ్ టి ఎల్ పరిధిలోకి వస్తుందని, కొంతమంది గ్రామ నాయకులకు ముడుపులు ముట్టాయని సమాచారం…పంచాయతీ కార్యదర్శి ఉత్సవ విగ్రహం లా మారిపోయాడని… వెంటనే అక్రమ నిర్మాణం ఆపివేసి… కఠిన చర్యలు తీసుకోవాలని తుప్పతి శ్రీనివాస్ తీన్మార్ మల్లన్న జనగాం జిల్లా కమిటీ తరుపున డిమాండ్ చేశారు.