అక్రమ విద్యుత్ వాడిన వ్యక్తి అరెస్ట్
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 జనం సాక్షి);
అక్రమ విద్యుత్ వాడిన ఈడిగ రామన్ గౌడు ను ఈనెల 14న గద్వాల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ కు తరలించినట్లు విద్యుత్ శాఖ విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ రెడ్డి తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని తప్పెట్ల మోర్సు గ్రామానికి చెందిన ఇడిగి రామన్ గౌడ్ (34) అనే వ్యక్తి గ్రామంలో జనరల్ స్టోర్ కు అక్రమ విద్యుత్ వాడుతున్నాడని గత సంవత్సరం జనవరి నెలలో విద్యుత్ శాఖ అధికారులు మొదటి తప్పుగా భావించి జరిమానా విధించారని అదే అలవాటుగా రెండవసారి జనరల్ స్టోర్ లో వ్యాపార సముదాయానికి అక్రమ విద్యుత్ వాడడం వల్ల విద్యుత్ శాఖ ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి రెండవ నేరంగా స్థానిక విజిలెన్స్ అండ్ ఏపీ టీఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈనెల 14న గద్వాల కోర్టు లో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ కు పంపడం జరిగిందని మహబూబ్ నగర్ విజిలెన్స్ సిఐ కాశిరెడ్డి, ఎస్ఐ అంజయ్య తెలిపారు.