Wednesday, 4 November 2026

అక్షరాల్లో వోదగని మానవీయ దృశ్యం

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనంసాక్షి). ఎడతెరిపి లేని వానలు. సిరిసిల్ల పట్టనాన్ని అతలకుతలము చేశాయి.ఒక్కసారిగా ఇండ్ల చుట్టూ కమ్ముకున్న వరద. అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం. ఎటు పాలుపోలేని స్థితిలో వృద్ధురాలైన తల్లిని రక్షించుకోలేక పడుతున్న మానసిక వేదన. సరిగ్గా అపద సమయంలోనే చల్లని స్నేహస్తం కన్న ప్రేమను మరిపించేలా గుండెలకు హత్తుకున్నది. “ఖాకి”లావి కరుకు గుండెలు అని నమ్మకంపేరుకుపోయినచోట.మానవీయత వెళ్లి విరిసింది. సిరిసిల్ల పట్టణంలో పరద బీభత్సం కమ్ముకున్న విషయం తెలిసిందడే. గురువారం వరదల్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబంలోని వృద్ధులని సిరిసిల్ల పోలీసులు రెస్క్యూ టీం సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా నిలబడ్డారు. అక్షరాల్లో వోదగని మానవీయ దృశ్యాన్ని ఆవిష్కరించారు. వృద్ధురాలిని తమ భుజాలపై మోసుకెళ్తూ సురక్షిత ప్రాంతానికి తరలించారు. స్థానికులు సిరిసిల్ల పోలీసులను అభినందిస్తున్నారు.