వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జడ్పీటీసీ రణం జ్యోతి.
దౌల్తాబాద్ జూలై 27, జనం సాక్షి.:దౌల్తాబాద్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల వల్ల పాత ఇల్లు కూలినట్లయితే వెంటనే ఆయా గ్రామాల సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు పాత, శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండడం క్షేమకరం కాదన్నారు. గ్రామాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు ఎవరు బయటకు రావద్దని సూచించారు. ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా, అధికారులు అందరూ అందుబాటులో ఉన్నారని తెలిపారు.