|
మనిషిగా బ్రతకడానికి మానవీయ గీతం వెలగాలని
పదిమందికి చేతన గీతమై పలికే మనిషిని నేను
అక్షరాలతో అనేకనేక భావాలను నిక్షిప్తం చేసి ప్రయోగించే షిప్ ని నేను
నిరంతరం అక్షరాలతో గుడి కడతాను
అప్పుడప్పుడు ఆనందంగా సీతాకోకచిలుకనై
పచ్చని చెట్ల పైనుండి ప్రవహించే జలపాతాల పైనుండి సాగిపోవాలని కుతూహల పడతాను
ఈ దేశపు మూడు రంగుల జెండా నై వెలుగొందుతాను
ప్రపంచానికే ఒక ఆలోచన ఆరాటాల గీతమై మెలుగుతాను
నేనెప్పుడూ ప్రజల పక్షాన నిలిచే ఒక విరిసినటువంటి రోజా గులాబీల ఎర్రని జెండాను అవుతాను
అందరికీ ఆత్మీయమైన గుండెలోని మమకారమైన మాలినియం లేని
మనోహర గీతాన్ని అవుతాను
ఒక సందేశాన్ని
జీవన భరోసాన్ని అందించే హస్తాన్ని నేను
నేను పూలలో విరిసిన పరిమళపు ధారగా
నేను జీవన గీతం అవుతాను తేజో కాంతిని అవుతాను
తెల్లని మెరుపుతారని అవుతాను
మల్లెపువ్వు నై పరిమళిస్తాను
డాక్టర్ సి.హెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453
|




