Thursday, 5 November 2026

కొప్పురాయిలో బతుకమ్మ వేడుకలకు సిద్ధం చేస్తున్న మహిళలు

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి) : మండల పరిధిలోని కొప్పురాయ్ గ్రామంలో బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని గ్రామం కూడలిలో మహిళలు బతుకమ్మ గద్దెను ఏర్పాటు చేసి తులసి మొక్కను నాటారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వేడుకలను నూటికి నూరు శాతం ఆదివాసి గిరిజనులైన గ్రామం కొప్పురాయిలో గిరిజన మహిళలు యువతలు మన సంస్కృతి సాంప్రదాయాలకు తీసిపోకుండా ఎంతో ఆడంబరంగా తీరొక పూలను చేర్చుతూ బతుకమ్మ ఆటపాటలతో అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆదివారం మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆటపాటలకు ప్రత్యేకంగా కూడలిలో చక్కని అలంకరణలతో ఏర్పాటు చేసుకున్నారు. నేటి నుండి నిమజ్జనం వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆటపాటలను కొనసాగిస్తారు.