ఎల్బీ నగర్( జనం సాక్షి )అఖిల భారత విశ్వకర్మ మహాసభ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా బ్రహ్మ ఇడికోజు సదానందం చారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సదానందం చారి మాట్లాడుతూ నా నీయమ్మకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నుండి సంఘ బాధ్యతలు చేపడుతూ జాతి కోసం నిరంతరం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ చారి మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విన్ చారి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ,రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి , రాష్ట్ర సలహా దారుడు బ్రహ్మ శ్రీ అద్దంకి కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు .
అఖిల భారత విశ్వకర్మ మహాసభ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జ్ గా : బ్రహ్మ ఇడికోజు సదానందం చారి




