ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరకంపాడు గ్రామ శివారులో రైతులు పశుగ్రాసం కోసం ఏర్పాటు చేసుకున్న 15 గడ్డి వాములు సోమవారం మధ్యాహ్నం అగ్నికి అహుతయ్యాయి. వీటి విలువ సుమారు 3లక్షలు ఉంటుందని రైతులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలే వేసివి కాలం దానికి తోడు దాచుకున్న పశుగ్రాసం కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.




