Wednesday, 4 November 2026

అచ్చంపేట మాదిగ విద్యార్థి సమాఖ్య ఇంచార్జి చిట్టిగొర పవన్ కళ్యాణ్ నియామకం

అచ్చంపేటఆర్సీ,19జులై,(జనం సాక్షి)న్యూస్ ;- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ బుక్కాపురం మహేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అచ్చంపేట నియోజకవర్గ నూతన ఇంచార్జి చిట్టి గోర పవన్ కళ్యాణ్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణను, రాజ్యాధికారం సాధించేలా, శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20 వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిరాహారదీక్ష లు ,నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జగదీష్, ఆంజనేయులు, ఉదయ్,వెంకట్, పాల్గొన్నారు.