అజిత్ ధోవ‌ల్ నివాసంలోకి ఓ వ్య‌క్తి చొర‌బ‌డే ప్ర‌య‌త్నం

న్యూఢిల్లీ: జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ నివాసంలోకి ఓ వ్య‌క్తి చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ వ్య‌క్తిని ఢిల్లీ పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. కారులో వ‌చ్చిన వ్య‌క్తి నేరుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే అక్క‌డ డ్యూటీలో ఉన్న సెక్యూర్టీ అత‌న్ని అడ్డుకున్న‌ది. ఆ వ్య‌క్తిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసు శాఖ‌కు చెందిన స్పెష‌ల్ సెల్ అత‌న్ని విచారిస్తున్న‌ది. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు మేర‌కు.. ఆ వ్య‌క్తి మాన‌సికంగా కృంగిపోయిన‌ట్లు తెలుస్తోంది. కిరాయి కారుతో ఆ వ్య‌క్తి ధోవ‌ల్ ఇంట్లోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న శ‌రీరంలో చిప్‌ను పెట్టార‌ని, దాని ద్వారా త‌న‌ను కంట్రోల్ చేస్తున్న‌ట్లు ఆ వ్య‌క్తి పోలీసుల‌కు చెప్పాడు.