Wednesday, 4 November 2026

అజిత్ రెడ్డిఆకస్మిక బదిలీ పట్ల విస్మయంవ్యక్తంచేసిన జంపనప్రతాప్

సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి  అక్టోబర్ 18 జనం సాక్షి  సికింద్రాబాద్  కంటోన్మెంట్ ప్రజలు ప్రజా హితవు కోరుతూ పలు అభివృద్ధి పనులు చేపడుతూ కంటోన్మెంట్ బోర్డు ప్రజల మన్ననలు అందుకుంటున్న ప్రస్తుత బోర్డ్ సీఈఓ అజిత్ రెడ్డి ఆకస్మికంగా బదిలీ కావడం బాధాకరమనిబోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పేర్కొ న్నారు. సీఈఓ అజిత్ రెడ్డి బెంగళూరు బదిలీ కావడంతో ఈ రోజు జంపన ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితిల్లో బొల్లారం హాస్పిటల్ ను జనరల్ హాస్పిటల్ గా మార్చి ఎంపి ఏ.రేవంత్ రెడ్డీ నిధులు. ఇతర దాతల సహకారం తో అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగ పడేలా కృషి చేశారని అన్నారు,అదేవిధంగా మహావీర్ ట్రస్ట్ అధ్వర్యంలో బాలంరాయి లో కంటి ఆసుపత్రి లో జనరల్ ఫెజీసియన్ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నా రని తెలిపారు. ఇక రెండు సార్లు స్వాచ సర్వేక్షన్ అవార్డులు సాధించడం లో సీఈఓ అజిత్ రెడ్డి కృషి చేశార న్నారు, ఇక తన విజ్ఞప్తి మేరకు మాలనీకాలనీ, అయ్యప్పసొసైటీ,హ్యాపీఎంక్లేవ్, లక్ష్మిగుంటి కాలనీల మధ్య కుల్వర్ట్లు,  కల్వర్తులతో బాటు మరో రెండు కల్వర్తుల నిర్మాణానికి సీఈఓ అజిత్ రెడ్డి ఆమోదం తెలిపి ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారని మరో ఆరు నెలలు అజిత్ రెడ్డి సీఈఓ గా కొనసాగినట్లైతే కుల్వర్తుల నిర్మాణంతో బాటు మరి కొన్ని అభివృద్ధి పనులు జరిగేవని అన్నారు, ఆకస్మిక బదిలీ జరగడం పట్ల విస్మయం బాధగా ఉందన్నారు.