రుద్రంగి అక్టోబర్ 18 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాల గ్రామనికి చెందిన ఎస్కే ఖలీమ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలిక రోజులాగే పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బాలికతో పాటు మరో ఇద్దరు చిన్నారులకు మాయ మాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా బాలికతో పాటు ఇద్దరు చిన్నారులు ఏడువడంతో ఖలీమ్ అక్కడి నుండి పారిపోయాడు.చిన్నారులు విషయం ఇంట్లో తల్లికి చెప్పడంతో తల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా నిదితునిపై ఫోక్స్లో మరియు ఎస్సి ఎస్టీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.బాలికను వైద్యం కోసం హాస్పత్రికి తరలించినట్లు అలాగే నిందితున్ని రిమాండ్ కు పంపిస్తామని ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.




