కుమ్రంభీం ఆసిఫాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులపై కలప స్మగ్లర్లు దాడి చేశారు. తిర్యాని మండలం మార్కగూడ అటవీప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అటవీశాఖ సిబ్బంది అదుపులోని స్మగ్లర్లను తప్పించేందుకు మరికొంత మంది స్మగ్లర్లు మూకదాడి చేశారు. కలప స్మగ్లర్ల దాడిలో నలుగురు అటవీశాఖ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిర్యాని పోలీసులకు అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




