అడవులను సందర్శించిన డిఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్
జూలూరుపాడు, సెప్టెంబర్ 2, జనంసాక్షి: జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలోని గుండెపుడి, వినోభానగర్, పాపకొల్లు అటవీ ప్రాంతాలను జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గత ఏడాది, ఈ ఏడాది అభివృద్ధి చేసిన ప్లాంటేషన్లలో మొక్కలను పరిశీలించారు. అటవీ ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాంలు, నీటి కుంటలతో పాటు వన్య ప్రాణుల ఆహారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గడ్డి మైదానాలను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రేంజ్ కార్యాలయానికి నూతనంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ ను ప్రారంభించి, మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, రేంజ్ అధికారి ప్రసాదరావు, డీఆర్వోలు లక్ష్మీనర్సు, ధనలక్ష్మి, సలీం, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్ ఆఫీసర్ రేఖ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.