Thursday, 5 November 2026

అడిక్‌మెట్‌ ఫ్లై ఓవర్‌పై కార్ల ఢీ: ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌,జూన్‌11(జ‌నం సాక్షి): నగరంలోని అడిక్‌మెట్‌ ఫ్లై ఓవోర్‌పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న రెండు కార్లు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు యత్నించారు.