అడ్డదారుల్లో భారీగా సంపాదిస్తున్న వైన్ షాపుల ఓనర్లు
బ్రాండ్ బాటిళ్ల మూత తీసి మరో సీసాలో లిక్కర్ పోసి మాయాజాలం,
*అడ్డదారుల్లో భారీగా సంపాదిస్తున్న ఓనర్లు,
*సిండికేట్గా మారి ఇష్టారాజ్యంగా అమ్మకాలు,
*యజమానులతో అధికారుల కుమ్మక్కు,
* ఎన్ ఫోర్స్ మెంట్ సోదాల్లో బట్టబయలు,
ఖానాపురంసెప్టెంబర్ 16జనం సాక్షి
వైన్ దుకాణాల్లో అమ్మే మద్యం చాలా ప్రాంతాల్లో కల్తీ అవుతున్నది. ఖానాపురం మండల కేంద్రంలోని
శంకర వైన్స్, లో గత కొన్ని నెలలుగా యజమానులు అక్రమాల బాటపడుతూ భారీగా సంపాదిస్తున్నారు. కస్టమర్లకు క్వాలిటీ సరుకు అందకుండా చేస్తున్నారు.ఖానాపురం మండల కేంద్రంలోని
శంకర వైన్స్, తో పాటు మరో రెండు వైన్స్ దుకాణాల ఓనర్లు సిండికేట్గా మారి ఇష్టమొచ్చినట్లు సేల్స్ చేస్తున్నారు. ఇట్టి విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పక్కా సమాచారం అందడంతో శుక్రవారం మండల కేంద్రంలోని శంకర వైన్స్ పై ఇన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో 16 ఐబిఆఫ్ లు, ఆరు రాయల్ స్టాక్ ఆఫ్ లు, ఏడు రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్ లో మూతలు ఓపెన్ చేసి కంది సునీల్ రెడ్డి, భూక్య రవి ఇద్దరు వ్యక్తులు వైన్ షాప్ లో వాటర్ నింపుతూ ఉండగా అధికారులు పక్కా సమాచారం మేరకు వైన్ షాప్ పై దాడి చేసి వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి వైన్ షాపులు సీజ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ ఏ ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ దాడిలో ఇన్ ఫోర్స్ మెంట్ సిఐలు శ్రీనివాస్ గౌడ్, మాధవిలత, ఇన్ ఫోర్స్ మెంట్ ఎస్ ఐ శంకర్ బాబు,సిబ్బంది పాల్గొన్నారు.