హైదరాబాద్,సెప్టెంబర్7(జనంసాక్షి): శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశారు. ఇక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతికలోపంతో కిందికి దింపేశారు. 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టి సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. విమానంలోని 168మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం తలెత్తింది. 168 మంది ప్రయాణికులతో గురువారం ఉదయం బయలు దేరిన విమానం తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం తిరిగి రన్‌వేపై దించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.




