జనంసాక్షి రాజంపేట్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో కాలు విరిగి బాధపడుతున్న చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కైల్ రాములు అనే పేషంట్ కు అత్యవసర పరిస్థితిల్లో అతీతక్కువ మందిలో ఉండే ఏ నెగెటివ్ రక్తం ఆపరేషన్ నిమిత్తమై అవసరం ఉండగా పేషంట్ కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతలు సేవా సమితి నిర్వాహకులను సంప్రదించగా, కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన రాజిరెడ్డి గారి సహకారంతో వారికి కావాల్సిన ఏ నెగెటివ్ రక్తం అందజేయడం జరిగింది.ఒక్క ఫోన్ కాల్ తో స్పందించి రక్తదానంకు ముందుకు వచ్చిన రక్తదాతకి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్ ముదాం శ్రీధర్ పటేల్ గార్లు అభినందనలు తెలియజేశారు.ఎవరికైన, ఎప్పుడైన రక్తం అవసరం ఉంటే 9666620006,9848687025 నంబర్లను సంప్రదించగలరని సేవా సమితి సభ్యులు తెలుపడం జరిగింది ,ఈ కార్యక్రమంలో కమ్మరి శ్రీను,పాలమకుల సాయి కుమార్ గౌడ్ వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ మరియు పేషంట్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Attachments area




