అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి-బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 2. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండల విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ ప్రతి ప్రైవేటు పాఠశాల ఎదుట ఫీజుల విషయంపై బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. అనుమతి లేకుండానే కొన్ని పాఠశాల నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాకేష్, సాగర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.